FbTelugu

ఈడి విచారణకు ఎం.పి నామా గైర్హాజరు

హైదరాబాద్: బిహార్ రాష్ట్రం రాంచి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం కుంభకోణం కేసులో ఖమ్మం టిఆర్ఎస్ ఎం.పి నామా నాగేశ్వర్ రావు ఇవాళ ఈడి విచారణకు గైర్హాజరు అయ్యారు.
బ్యాంకులకు రుణాల ఎగవేత, నిధులు విదేశాలకు తరలింపులో నామాకు చెందిన మధుకాన్ గ్రూపు కంపెనీలపై సిబిఐ తో పాటు ఈడి కేసులు నమోదు చేసింది.

నామా నాగేశ్వర్ రావు నివాసంతో పాటు కార్యాలయాల్లో ఇటీవలే ఈడి పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. శుక్రవారం నాడు విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడి నోటీసులు జారీ చేయగా, వెళ్లకుండా విచారణకు సమయం కోరారు. తదుపరి విచారణకు హాజరు కావాల్సిందిగా నామా నాగేశ్వర్ రావు కు ఈడి సమన్లు జారీ చేయనున్నది. అయితే మధుకాన్ గ్రూపుతో తనకు సంబంధం లేదని ఈడి దాడుల తర్వాత ఎం.పి వెల్లడించడం గమనార్హం.

You might also like

Leave A Reply

Your email address will not be published.