FbTelugu

బిపిఎల్ కుటుంబాలకు ఉచిత వైద్యం: ఉత్తమ్

సూర్యాపేట: తెలంగాణలో 80 లక్షల బిపిఎల్ కుటుంబాలకు కరోనా చికిత్స ఉచితంగా అందించాలని పిసిసి చీఫ్, ఎంపి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా పట్ల ప్రజలలో భయాందోళన నెలకొనడానికి టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వ మెసపూరిత విధానాలే కారణమని ఆయన ఆరోపించారు.

శనివారం హుజూర్ నగర్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కరోనా మహమ్మారి ప్రారంభమై ఒక సంవత్సరం మూడు నెలలు పూర్తి అయిన తరువాత కెసిఆర్ కు ఇప్పుడు ఆస్పత్రులు, రోగులు గుర్తుకు రావడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వం ప్రతిరోజు విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్ లో టెస్ట్ లు, వ్యాక్సిన్, మరణాలు తదితర వివరాలు పూర్తిగా అసత్యమన్నారు. తెల్లరేషన్ కార్డు కలిగిన 80 లక్షల పేద కుటుంబాలకు ఆక్సిజన్, అంబులెన్స్, చికిత్స ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంలో రాష్ట్ర గవర్నర్ ని కలిసి విన్నవించినా ఎలాంటి మార్పు రాలేదన్నారు. టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం అసమర్ధత, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు హైకోర్టు తీర్పును కూడా లెక్క చేయడంలేదన్నారు.

రాష్ట్రంలో కరోనా దుస్థితి, ప్రభుత్వ అలసత్వంపై మళ్లీ హైకోర్టుకు వెళ్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వ నియంత్రణ లేదన్నారు. సామాన్యులు మోయలేని విధంగా ఆక్సిజన్ కు రూ.50వేలు, అంబులెన్స్ కు రూ.20 వేలు, వెంటిలేటర్ రూ.1లక్ష బిల్లులు వేయడం దారుణమని అన్నారు. పొరుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు కరోనా చికిత్సకు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణలో ఎందుకు ఇవ్వడంలేదన్నారు. గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ వచ్చిపోయిన తరువాత పది జిల్లాల పరిధిలో కేవలం రూ.400 ఖర్చుతో ఆర్.టి.పి.సి.ఆర్ టెస్ట్ లు చేయిస్తే సుమారు రూ.9కోట్లతో పరిస్థితి చక్కబడేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.