FbTelugu

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

కెసిఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 100 మంది వర్కింగ్ జర్నలిస్టులు కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారని, జర్నలిస్టులను వెంటనే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
దేశం మొత్తంలో దాదాపు పదిహేను రాష్ట్రాలలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించారని సిఎం కెసిఆర్ కు రాసిన లేఖలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

జర్నలిస్టులకు ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని వివరించారు. కరోనా వైరస్ సోకి చనిపోయిన జర్నలిస్టులకు రూ.5 లక్షల నష్ట పరిహారం కూడా చెల్లిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా తక్షణమే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని డిమాండ్ చేశారు. వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలన్నారు. నిత్యం ప్రజలు, ప్రజా సమస్యల కోసం పని చేసే జర్నలిస్టులు కరోనాతో చనిపోతే రూ.5 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని సిఎం కెసిఆర్ కు వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.