FbTelugu

ఎంపీ కేకేనే బురిడీ కొట్టించిన కేటుగాడు

హైదరాబాద్: నిరుద్యోగులకు రూ.25 లక్షల రుణమంటూ.. ఏకంగా ఎంపీ కేకేనే బురిడీ కొట్టించాడు ఓ కేటుగాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేష్ అనే యువకుడు ఎంపీ కేకే కు ఫోన్ చేసి.. తాను కేంద్ర పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ని అంటూ మాటలు కలిపాడు.

నిరుద్యోగ యువకులకు రూ.25 లక్షల రుణం ఇచ్చే పథకం ఉందని దానికి యువకులను ఎంపిక చేసే బాధ్యత కేటీఆర్ సలహా మేరకు కేకే కు ఇస్తున్నట్టు తెలిపాడు. అయితే దీనిపై కేకే తన కూతురు కార్పొరేటర్ విజయలక్ష్మితో మాట్లాడాలంటూ.. తెలిపాడు. దీంతో విజయలక్ష్మి కొందరికి తెలిపింది. అయితే ఈ రుణం రావాలంటే ఒక్కొక్కరు రూ.1.25 లక్షల చొప్పున ప్రసెస్సింగ్ ఫీ చెల్లించాలని మహేష్ తెలిపారు. అనుమానం వచ్చిన కేకే వాకబ్ చేశారు. కానీ అప్పటికే డబ్బులు వేసి అఖిల్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

You might also like