FbTelugu

కేసీఆర్ కు ప్రపంచవ్యాప్తంగా ఆస్తులు: ఎంపీ అరవింద్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర ఆరోపణలు చేశారు.

హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీని, పాకిస్థాన్ వేర్పాటువాది మహ్మద్ అలీ జిన్నాతో పోల్చుతారా అని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ వ్యతిరేకుల చేతుల్లో పెట్టాడని, కేసీఆర్ కు ఓవైసీ పెద్ద కొడుకు అని ఆయన విమర్శించారు.

ప్రజలు కరోనా వైరస్ తో చస్తూ, ఉపాధి లేక అల్లాడుతుంటే కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో రెస్టు తీసుకుంటారా అని ఎంపీ అరవింద్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యం మూలంగా కేంద్రం అందించే సాయాన్ని కూడా అందుకోలేకపోతున్నామని ఆయన అన్నారు. కేసీఆర్, కేటీఆర్ చెంచాలు కేంద్రంపై లేనిపోని ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

You might also like