FbTelugu

సినిమాలు ఓటీటీ బాట పట్టాయి!

కరోనా వైరస్ అన్ని రంగాలను చిదిమేసినట్లుగానే సినిమా రంగాన్ని భారీగా కుదిపింది. ఈ కుదుపునకు కోలుకోలేని విధంగా కుదేలయ్యింది. సినిమా థియేటర్లు తెరుస్తారని నిన్నటి వరకు ఎదురు చూసిన చిత్ర పరిశ్రమ నేడు ఓటీటీ బాట పట్టే పరిస్థితికి వచ్చింది.

డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ను తీవ్రంగా వ్యతిరేకించిన వారు ఇప్పుడే ఇదే కరెక్టు అనే విధంగా మాట్లాడుతున్నారు. కరోనా వైరస్ ఉధృతి కారణంగా సినిమా థియేటర్, మాల్స్ ను ఇప్పట్లో తెరిచే పరిస్థితులు కన్పించడం లేదు. ప్రభుత్వం అనుమతించినా అనేక నిబంధనలు విధించే అవకాశం ఉంది. ప్రధానంగా భౌతిక దూరం తో పాటు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు థియేటర్ల యజమానులకు భారంగా పరిణమించనున్నాయి. టిక్కెట్ల ధరలు రెండు మూడింతలు చేస్తే తప్ప ఆట ఆడిచ్చే పరిస్థితి లేదు.

ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న చిత్ర పరిశ్రమ ఓటీటీ బాట పట్టడమే సరైందనే నిర్ణయానికి వచ్చింది. తను నిర్మించిన వి సినిమాను డిజిటల్ ఫ్లాట్ పామ్ పై విడుదల చేస్తానని దిల్ రాజు ప్రకటించారు. ఈయన బాటలోనే మిగతా వారు ముందుకు నడవనున్నారు.

You might also like