FbTelugu

క్షణాల్లో సినిమా డౌన్ లోడ్…

క్షణాల్లో ఫోర్ కే, ఎయిట్ కే, హెచ్ డీ ఫార్మాట్ సినిమాలు డౌన్ లోడ్ అయితే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది.

క్షణానికి 44 టెర్రాబైట్ల (టీబీ) వేగంతో ఇంటర్ నెట్ వస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇలాంటి అసాధ్యాన్నే సుసాధ్యం చేశారు ఆస్ట్రేలియలోని పరిశోధకులు.

ఆస్ట్రేలియాలోని మొనాష్, స్విన్ బర్న్, ఆర్ఎంఐటీ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు ఆవిష్కరించిన ఈ పరిశోధన వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో ప్రచురించారు. ప్తరస్తుతం వినియోగిస్తున్న ఫైబర్ ఆప్టిక్స్ కు మైక్రో కాంబ్ పరికరాన్ని జోడించి ఈ విజయాన్ని ఆవిష్కరించారు.

మైక్రో కాంబ్ చిప్ 80 లేజర్లతో సమానమని, దీని ద్వారా వందలాది ఇన్ ఫ్రారెడ్ లేజర్ కిరణాలు ప్రసరించడం ద్వారా నెట్ స్పీడ్ పెరుగుతుందని జర్నల్ లో వివరించారు.

 

You might also like