FbTelugu

మాకు తెలియకుండా తరలించారు: కమిషనర్

విజయనగరం: మా అనుమతి లేకుండా, మాకు తెలియకుండానే చెత్త తరలించే వాహనంలో కరోనా రోగులను తరలించారని నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్ జేఆర్.అప్పలనాయుడు స్పష్టం చేశారు.
నెల్లిమర్ల లో జరజాపు పేటకు చెందిన కొందరు గ్రామ పెద్దలు కొందరు వ్యాధిగ్రస్తుల ను సమీపంలోని మహరాజా వైద్య కళాశాల ఆసుపత్రికి అత్యవసరంగా తరలించాలని భావించారు. వాహనం కోసం వాళ్లు ఎదురు చూస్తుండగా చెత్త తరలించే మునిసిపల్ వాహనం వెళ్లడాన్ని గమనించి అడ్డగించారని కమిషనర్ తెలిపారు. ఈ వాహనంలో కరోనా రోగులను తరలించినట్లు తనకు ప్రాథమికంగా తెలిసిందన్నారు. వారికి తెలిసిన ఒక డ్రైవర్ కు పిపిఈ కిట్ వేసి చెత్త తరలించే వాహనంలో కరోనా రోగులను తరలించారన్నారు.

కరోనా వ్యాధిగ్రస్తుల ను తరలించేందుకు ఎన్నడూ నగర పంచాయతీ వినియోగించ లేదన్నారు. మా అనుమతి లేకుండా, మాకు తెలియకుండానే వాహనాన్ని తీసుకు వెళ్లారని స్పష్టం చేశారు. వాహనం తీసుకు వెళ్ళడానికి బాధ్యులైన సిబ్బందిని గుర్తించి చర్యలు తీసుకుంటామని కమిషనర్ అప్పలనాయుడు తెలిపారు.మాకు లిపారు.

You might also like