FbTelugu

నర్సింగ్ యాదవ్ మృతికి సంతాపం

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

నర్సింగ్ యాదవ్ మృతిపట్ల టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ బాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. టాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులు ఆయన మృతిపై విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. హైదరాబాద్ లో 1963 లో జన్మించిన మైలా నర్సింగ్ యాదవ్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 300 కు పైగా చిత్రాల్లో నటించారు. విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన ప్రజల మనిషి, హేమాహెమీల చిత్రాలతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. శంకర్ దాదా ఎంబీబీఎస్, భాష, క్షణక్షణం, మాస్, గాయం వంటి సినిమాల్లో అభిమానులను అలరించారు. రామ్ గోపాల్ వర్మ తను తీసే ప్రతి సినిమాలో నర్సింగ్ యాదవ్ కు ఒక పాత్ర కల్పించేవారు. ఆయనకు భార్య చిత్రా యాదవ్, కుమారుడు రుత్విక్ యాదవ్ ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.