FbTelugu

మోటొరోలా 4 మోడళ్లు విడుదల

వాషింగ్టన్: మొబైల్ దిగ్గజం మోటొరోలా కంపెనీ ఒకేసారి నాలుగు మోడళ్లను ఆవిష్కరించి మిగతా కంపెనీలకు సవాల్ విసిరింది. మోటొ జీ స్టైలస్, మోటొ జి పవర్, మోటొ జీ ప్లే, మోటొరలా వన్ 5జీ స్మార్ట్ ఫోన్లు అమెరికా మార్కెట్ లోకి విడుదల చేసింది.

ఆన్ లైన్ అంగళ్లలో జనవరి 13 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. ఇంకా ఇండియాలో ఎప్పుడు విడుదల చేసేది ప్రకటించలేదు. ఈ ఏడాది ప్రథమార్థంలో 5జీ టెక్నాలజీ ఇండియాలో ప్రారంభించే సూచనలు ఉండడంతో పలు కంపెనీలు 5జీ మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి. జీయో కంపెనీ కూడా చౌక ధరకు 5జీ మొబైళ్లను అందించేదుకు సన్నాహాలు చేస్తున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.