FbTelugu

రూ.11,999 కే మోటో కొత్త ఫోన్

మోటోరోలా కంపెనీ జీ9 పవర్ పేరుతో మరో ఫోన్ మార్కెట్ లోకి ఆవిష్కరించింది. గతంలో విడుదల అయిన జీ9కు అదనంగా కొన్ని ఫీచర్స్ జతపర్చి విడుదల చేశారు. 6.8 అంగుళాల హెచ్.డీ ఫ్లస్ పంచ్ హోల్ డిస్ ప్లే ఆకట్టుకునే విధంగా ఉంది.

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 66 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో వచ్చిన ఈ ఫోనులో మెయిన్ కెమెరా 64 ఎంపీ కాగా రెండో కెమెరా 16 ఎంపీతో ఉంది. 4జీబీ ర్యామ్, 128 ఇంటర్నల్ మెమొరీ ఉన్న ఈ మొబైల్ మెమొరీ 512 జీబీ వరకు సపోర్టు చేయనున్నది. 20 వాట్స్ ఛార్జింగ్ తో 6000 ఎంఏహెచ్ వరకు బ్యాటరీ అమర్చారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి ఫ్లిప్ కార్టులో రూ.11,999 కి ఈ మొబైల్ లభ్యం కానున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.