FbTelugu

వన్ ప్లస్ నార్డ్ కు పోటీగా మోటో 5జీ

ముంబై: కొత్త టెక్నాలజీ అయిన 5జీ టెక్నాలజీతో మిడ్ రేంజ్ విడుదల అయిన వన్ ప్లస్ నార్డ్ కు పోటీ మోటోరోలా కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి తెస్తున్నది. ఈనెల 30 మార్కెట్ లోకి విడుదల చేస్తున్నది.
ఇప్పటికే 5జీ టెక్నాలజీతో తీసుకువచ్చిన రేజర్ 5జీ ధర అధికంగా ఉండడంతో మధ్యతరగతి వినియోగదారులు ఆసక్తి చూపించడం లేదు. నార్డ్ ఫోన్ సక్సెస్ కావడంతో దాని కన్నా తక్కువ ధరకే మోటో ఫోన్ ను తీసుకువస్తున్నారు. ఇప్పటికే యూరప్ మార్కెట్ లో విడుదలైంది.

ఐపీఎస్ ఎల్.సీ.డీ స్క్రీన్ తో ఉన్న ఈ ఫోన్ 6.7 అంగుళాలు. 6జీబీ ర్యామ్ తో 128 జీబీ స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంది. వెనకాల మూడు కెమెరాలు ముందు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటితో పాటు వీవో వీ20 పేరిట 5జీ మొబైల్ ను మార్కెట్ లోకి తెస్తున్నది. ధర కూడా రూ.30వేల లోపే ఉండనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.