FbTelugu

ప్రగతి భవన్ కు వద్దన్నా వెళ్లిన మోత్కుపల్లి

బిజెపి అధిష్ఠానం సీరియస్
హైదరాబాద్: క్రమశిక్షణ పార్టీగా పేరున్న బిజెపి లో కట్టుబాట్లు తప్పుతున్నాయి. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి ప్రగతి భవన్ లో జరిగిన సిఎం కెసిఆర్ సమావేశానికి హాజరయ్యారు.
ఈ వ్యవహారంపై బిజెపి నాయకత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇవాళ ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన సిఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకం విధివిధానాలపై అఖిలపక్షం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీల కార్యాలయాలకు సిఎం కార్యాలయం సమాచారం పంపించింది. అయితే ఈ సమావేశానికి వెళ్లకూడదని బిజెపి రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.

పార్టీ నిర్ణయాన్ని బేఖాతర్ చేస్తూ మోత్కుపల్లి నర్సింహులు ప్రగతి భవన్ సమావేశానికి హాజరై కెసిఆర్ ను కీర్తించారు. దళితుల అభివృద్ధై అఖిలపక్షం నిర్వహించడం అభినందనీయమన్నారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీసు స్టేషన్ లాకప్ డెత్ లో చనిపోయిన దళిత మహిళ మరియమ్మ విషయంలో సిఎం కెసిఆర్ తీసుకున్న చర్యలు ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని అభినందించారు. అదే సమయంలో నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో జరిగిన దళిత నేతల భేటీకి మోత్కుపల్లి నర్సింహులు డుమ్మా కొట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.