FbTelugu

తల్లి మరణం… అప్పటి నుంచి చీకటి గదిలోనే!

అహ్మదాబాద్: తల్లి అకాల మరణం చెందడంతో తీవ్ర వేదనకు గురైన ముగ్గురు సంతానం దశాబ్ధకాలం నుంచి చీకటి గదిలోనే మగ్గుతున్నారు. వారిని ఒక స్వచ్ఛంద సంస్థ రక్షించి బయటకు తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాజ్ కోట్ లో పదేళ్ల నుంచి ఒకే గదిలో ఇద్దరు సోదరులు, ఒక సోదరి నివసిస్తున్నారు. వెలుగు దూరని గదిలో ఉంటున్న వీరికి ప్రతిరోజు తండ్రి భోజనం అందచేస్తున్నారు. కొన్నేళ్ల నుంచి వారికి భోజనం అందిస్తున్న తండ్రి ఒక ఎన్జీఓ సంస్థకు ఈ విషయాన్ని తెలియచేయగా వారు చేరుకున్నారు. వెంటనే వారు ఆ ఇంటి వద్దకు చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. వారిని చూసిన ఎన్జీఓ సభ్యులు నిర్ఘాంత పోయారు. వింత ఆకారాలతో కనిపిస్తూ, కనీసం నిలబడ లేకపోతున్నారు.

వీరందరినీ బయటకు తీసుకువచ్చి ప్రత్యేక వాహనంలో పునరావాస శిబిరానికి పంపించారు. వైద్య పరీక్షల తరువాత వీరికి కౌన్సెలింగ్ ఇప్పించి సాధారణ జనజీవన స్రవంతిలోకి తీసుకురానున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.