FbTelugu

తల్లీ, కొడుకు ఒకేసారి టెన్త్ పాస్…

ముంబై: చిన్నప్పుడే పెళ్లి అయింది. అయినా చదువుపై ధ్యాస తగ్గకపోవడంతో కుమారుడితో కలిసి చదువుకున్నది. ఇద్దరూ ఒకేసారి పరీక్షలు రాసి పాసయ్యారు. భర్త ప్రోత్సాహం, కుమారుడి సహకారంతో పాసైనట్లు ఆ మహిళ తెలిపారు.

ప్రదీప్ గౌరవ్ తో బేబీ గౌరవ్ కు కొన్నేళ్ల క్రితం వివాహం జరగ్గా వీరికి ఒక కుమారుడు జన్మించాడు. చిన్న వయస్సులో పెళ్లి కావడంతో టెన్త్ క్లాస్ కూడా పూర్తి చేయలేకపోయింది. దీనిపై బెంగపెట్టుకున్న ఆమె పిల్లలు పెద్దవాళ్లు అయిన తరువాత చదువుకోవాలని నిర్ణయించింది. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజులు కట్టేసి, కుమారుడితో కలిసి చదివింది.

తల్లి బేబీకి 64.40 మార్కులు రాగా కుమారుడు సదానంద కు 73.20 శాతం మార్కులు వచ్చాయి. దుస్తుల కంపెనీలో పనిచేస్తూ ఖాళీ సమయాల్లో చదువుకుని పాసైనట్లు బేబీ తెలిపింది.

You might also like