FbTelugu

నా కుమారున్ని ఎన్‌కౌంటర్ చేయాలి: గ్యాంగ్‌స్టర్ తల్లి

లక్నో: అరెస్టు చేయడానికి వచ్చిన ఎనిమిది మంది పోలీసులకు అకారణంగా చంపేసిన తన కుమారుడు, గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ను ఎన్‌కౌంటర్ చేయాలని అతని తల్లి సరళాదేవి అన్నారు.
భౌతికంగా పట్టుకునే అవకాశం ఉన్నా, పట్టుకోకుండా మట్టుబెట్టాలని ఆమె పోలీసు అధికారులను కోరారు. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన పోలీసులను చంపి తమ కుటుంబానిక అపఖ్యాతి తెచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాన్పూర్ లో మొన్న వికాస్ దూబే జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

అయితే ఈ కాల్పులపై దూబె తల్లి సరళాదేవి సాటి మహిళగా కఠినంగా స్పందించింది. అతడు వెంటనే పోలీసులకు లొంగిపోవాలని కోరుకుంటున్నానని అన్నారు. లొంగిపోకుండా తప్పించుకుని తిరిగితే పోలీసులే పట్టుకుని ఎన్‌కౌంటర్ చేస్తారని ఆమె తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచేందుకు మంత్రి సంతోష్ శుక్లాను హత్య చేశాడని ఆమె వివరించారు. తన చిన్న కుమారుడు తో కలిసి లక్నోలో ఉంటున్నానని, నాలుగు నెలలుగా వికాస్ ను కలవడం లేదన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.