FbTelugu

బెదిరింపులు తాళలేక తల్లీకూతురు ఆత్మహత్యాయత్నం

ఖమ్మం: కొణిజర్ల మండలం తీగల బంజరలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు దారుణానికి దిగాడు. టిఆర్ఎస్ నాయకుడి వ్యవహారం సినిమాల్లో విలన్ మాదిరి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

భర్తను కోల్పోయిన మహిళా కుటుంబం వ్యవసాయ భూమిపై అధికార పార్టీ నాయకుడు కన్నేశాడు. బలవంతంగా భూమిని స్వాధీనం చేసుకునేందుకు బల ప్రయోగం చేశాడు. తమ భూమి లాక్కోవద్దని ఒంగూరి అనసూర్య, ఆమె కుమార్తె సుజాత ఎన్నిసార్లు చెప్పినా నాయకుడు విన్పించుకోలేదు. గ్రామంలో పెద్ద మనుషులు కూడా టిఆర్ఎస్ నాయకుడిని నిలువరించినా తన ఆగడాలు ఆపలేదు. నాయకుడి బెదిరింపులు భరించలేక తల్లీకుతురు ఒంగురి అనసూర్య, సుజాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా టిఆర్ఎస్ నాయకుడు అధికార బలంతో కప్పిపుచ్చాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.