FbTelugu

ఫ్లైఓవర్ పైనుంచి దూకిన తల్లీకొడుకు

కర్నూలు: జిల్లాలోని స్థానిక బళ్లారి చౌరస్తాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన కొడుకుతో సహా ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.

ఇది గమనించిన స్థానికులు తీవ్రగాయాలపాలైన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ మహిళ వెల్దుర్తికి చెందిన వాసవిగా గుర్తించారు. అయితే ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

You might also like