FbTelugu

దారుణం.. ఇల్లుకూలి తల్లీ కూతుళ్లు మృతి

మహబూబ్ నగర్: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందిన ఘటన జిల్లాలోని గండీడు మండలం పగిడ్యాలలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. తల్లి శరణమ్మ, ఇద్దరు కూతుళ్లు వైశాలి, భవాని ఇంట్లో నిద్రిస్తూ ఉండగా ఒక్కసారిగా ఇళ్లు కూలడంతో ముగ్గురూ.. మృత్యువాత పడ్డారు. ఒకే ఇంట్లో ముగ్గురు మృత్యువాత పడడంతో పగిడ్యాలలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

You might also like