FbTelugu

స్మశాన వాటికలో తల్లీ, కూతురు దహనం!

భయపడి తప్పించుకున్న కుమారుడు
నెల్లూరు: భర్త తాగుడుకు బానిస కావడం, కుటుంబ కలహాలతో ఒక మహిళ తన పిల్లలతో కలిసి స్మశాన వాటికకు వెళ్లి సజీవ దహనం చేసుకున్నది. ఇది గమనించిన కుమారుడు భయంతో బయటకు పరుగులు తీయడంతో ప్రాణం దక్కించుకున్నాడు.
ఆత్మకూరు పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… నెల్లూరు నవాబుపేట యనమలపాలెం కు చెందిన ఆదినారాయణ కుమార్తె వెంకటసుబ్బులు ను తన అక్క కుమారుడు కొండ్రెడ్డి బాబుకు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశాడు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం పేర్లపేట గ్రామానికి చెందిన కొండ్రెడ్డి బాబు, వెంకటసుబ్బులు దంపతులకు మహేష్ బాబు (7), మధురవాణి (5) సంతానం ఉన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కర్ణాటక బళ్లారిలోని సిరిగిరి గ్రామంలో పండ్ల తోటను కౌలుకు తీసుకుని అక్కడే ఉంటున్నారు.

భర్త తాగుడుకు వ్యసనం కావడంతో వద్దని భార్య, కుమార్తె నిత్యం వారించేవారు. వినకపోవడంతో విసుగు చెందిన భార్య తన ఇద్దర పిల్లలతో కలిసి గురువారం ఉదయం నెల్లూరు బయలు దేరింది. తెల్లవారు జామున నెల్లూరుపాలెం సెంటర్ లో బస్సు దగింది. సెంటర్ లో టీ తాగిన తరువాత వింజమూరు మార్గంలో ఉన్న ముస్లిం స్మశాన వాటికకు పిల్లలతో లోపలికి వెళ్లింది. శానిటైజర్ శరీరంపై జల్లుకుని పిల్లలపై కూడా చల్లింది. నిప్పంటించే క్రమంలో కుమారుడు మహేష్ భయంతో బయటకు పరుగులు తీశాడు. కుమార్తెకు, తనకు అంటించుకోవడంతో మంటల్లో కాలి అక్కడికక్కడే చనిపోయారు.
తప్పించుకున్న కుమారుడు నెల్లూరుపాలెం సెంటర్ కు చేరుకోగా, కూలీలు గమనించి స్థానిక కౌన్సిలర్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్మశాన వాటికకు చేరుకోగా తల్లి, బిడ్డ మంటల్లో చనిపోయి ఉన్నారు. సమాచారం అందడంతో ఆత్మకూరు సిఐ సోమయ్య, ఎస్సై రవినాయక్ ఘటనా స్థలం చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.