FbTelugu

అత్యధిక టెస్టులు ఏపీలోనే: మంత్రి అనిల్

అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుండగా.. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతున్నాయని మంత్రి అనిల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరోనా మరణాల రేటు తక్కువగా ఉందన్నారు.

ఇదే సందర్భంలో కరోనా వైరస్ బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నవారి రేటు ఎక్కువగా ఉందని తెలిపారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ల విషయంలో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు. హైదరాబాదులో ఉండి లేఖలు మాత్రమే రాస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రజలకు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయవద్దని సూచించారు.

You might also like