FbTelugu

‘ఈ వారం రోజులు అత్యంత కీలకం’: డీజీపీ

హైదరాబాద్:  కారోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని, ఈ వారం రోజులు అత్యంత కీలకమైనవని తెలంగాణ డీజీపీ అన్నారు. వచ్చే వారం రోజుల పాటు కఠినంగా వ్యవహరిస్తేనే కరోనా నుంచి బయటపడతామని అన్నారు. పబ్లిక్, ప్రయివేటు ట్రాన్స్పోర్ట్ లకు అనుమతి లేదని తెలిపారు. ఇష్టానుసారంగా తిరిగితే తీవ్ర నష్టం మనకేనన్నారు. ప్రజలంతా దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. కఠినంగా వ్యవహరించిన చోటనే కరోనా నియంత్రణలో ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి పలు విషయాలు వెళ్లడించారు.

ప్రజా ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుంచి 31 మార్చ్ వరకు తెలంగాణ లాక్ డౌన్ అమలులో ఉంటుందని తెలిపారు. జివో 45 ద్వారా ప్రజలకు అన్ని విషయాలను తెలియజేశామన్నారు. ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలన్నారు. డే టైం లో అమలులో ఉండే నిత్యావసర వస్తువులు అన్ని రాత్రి 7 గంటలకు క్లోజ్ చేస్తామని తెలిపారు. ఒక కాలనీ లో వెహికిల్ ఆ కాలనీలో ఒకటి రెండు కిలో మీటర్ల మాత్రమే తిరగాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారని, ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికిల్ సీజ్ చేస్తారని తెలిపారు.

సీజ్ చేసిన వాహనాలు వైరస్ తీవ్రత తగ్గిన తరువాత రిలీజ్ చేస్తారని తెలిపారు. ప్రైవేట్ వాహనాలు నిత్యావసర వస్తువులు క్యారీకి మాత్రమే అనుమతించినట్టు తెలిపారు. మీడియాకు ఎక్కడైనా తిరికే అనుమతులాచ్చినట్టు తెలిపారు. వైలేషన్ కి పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ప్రతి బైక్ పై ఒక వ్యక్తి, ఫోర్ వీలర్ పై ఇద్దరికి మాత్రమే అనుమతించినట్టు తెలిపారు. ఆటో అసోషియేషన్ కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఇవ్వాళ మధ్యాహ్నం నుంచి కఠినంగా లాక్ డౌన్ అమలు చేయనున్నట్టు తెలిపారు. లాక్ డౌన్ పై ప్రధాని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. దీనికి ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని సూచించారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More