FbTelugu

మున్ముందు మసీదులు లాక్కుంటారు: అసద్

Mosques-take-over-in-future-says-Asad

హైదరాబాద్: సంఘ్ పరివార్ రాబోయే రోజుల్లో మసీదులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరించారు. ముస్లిం ఎవ్వరికి బయపడొద్దు.. భయపడి బతకాల్సిన అవసరం లేదన్నారు. న్యాయం కోసం పోరాటం చేద్దాం దేవుని పై నమ్మకంతో పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ వర్మ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను. భారత్ ను హిందూ ఇజం నుంచి కాపాడాలి. మేము కాంగ్రెస్ తో ఎందుకు కలుస్తాము?..కాంగ్రెస్ బీజేపీ తో కలిసిపోయిందన్నారు. భారత్ ను రక్షించేందుకు ధర్మం, న్యాయం ఉందన్నారు.

రామ మందిర్ పై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన తరువాత అసదుద్దీన్ మీడియాతో మాట్లాడారు. రామ మందిరం స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు తుది నిర్ణయం అన్నారు. న్యాయమైన హక్కుకోసం పోరాటం చేస్తున్నాము. మేము ఎవ్వరి దగ్గర భిక్ష కోసం పోరాటం కాదు. 5 ఎకరాల భూమి కేటాయింపు తిరస్కరించాలని, వేరే చోట మసీదు మేము కట్టుకోగలమన్నారు. నా వ్యక్తిగతంగా నేను సుప్రీంకోర్టు తీర్పు పై సంతృపిగా లేనన్నారు. బాబ్రీ మసీదుకు సుమారు 5వందల సంవత్సరాల ఘన చరిత్ర ఉందని, సుప్రీంకోర్టు తీర్పు పై సంతృప్తి లేదని వ్యాఖ్యానించారు. తీర్పుపై పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్ కానీ ఆమోదించే విధంగా లేదని అన్నారు.

త్వరలోనే అల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డ్ మీటింగ్ నిర్వహిస్తామన్నారు. సుప్రీం తీర్పు పై రివ్యూ పిటిషన్ వెయ్యలా? వద్దా? అని మీటింగ్ అనంతరం తెలియజేస్తామన్నారు. శాంతి భద్రతలను, ఎవ్వరిని రెచ్చగొట్టడానికి నేను మాట్లాడటం లేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు పై నాకు అపారమైన గౌరవం ఉంది, భవిష్యత్ లో ఉంటుందన్నారు.

You might also like