FbTelugu

ఇండియా నుంచి మరిన్ని వ్యాక్సిన్లు

న్యూఢిల్లీ: ఇండియా నుంచి మరిన్ని కరోనా వ్యాక్సిన్లు వస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో మోదీ వర్చువల్ గా మాట్లాడారు.

కరోనాకు సంబంధించిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని, మానవ వనరులను కూడా పెంచుకుంటున్నామని ప్రధాని వివరించారు. ఈ పరీక్షలకు అవసరమైన సాంకేతికను కూడా అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. ఇప్పటికే తాము తయారు చేసిన రెండు వ్యాక్సిన్లను ప్రపంచానికి అందించామని, మరికొన్నింటిని త్వరలోనే ఆవిష్కరిస్తామని మోదీ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.