FbTelugu

ఆంధ్రాలో మరిన్ని సడలింపులు..

అమరావతి: లాక్ డౌన్ నిబంధనల నుంచి మరిన్ని మినహాయింపులు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నగలు, బట్టలు, చెప్పులు తెరిచేందుకు అనుమతిని ఇచ్చింది.

అదే విధంగా స్ట్రీట్ ఫుడ్స్‌ సైతం తెరిచి ఉంచుకోవచ్చంటూ స్పష్టం చేసింది. అయితే షాపులు అనుసరించాల్సిన విధానాలపై మార్గదర్శకాలు జారీ చేసింది. పెద్ద షోరూమ్‌లకు వెళ్లాలంటే ముందుగానే ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏ దుఖాణంలో కూడా ట్రయల్ రూమ్ లలోకి వినియోగదారులను అనుమతించవద్దని పేర్కొంది. తోపుడు బండ్లపై ఆహారం విక్రయించేవారు పార్సిల్ సర్వీసు మాత్రమే చేయాలని ఆదేశాల్లో తెలిపారు. ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న వారే ఆహార విక్రయ బండ్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. నగల షాపుల్లో సేల్స్ మెన్స్ తప్పనిసరిగా గ్లౌజులు ధరించాలని ప్రభుత్వ తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

You might also like