FbTelugu

బీసీలకు జగన్ పెద్దపీట: మంత్రి మోపిదేవి

గుంటూరు: రాజ్యసభ లో గుంటూరు జిల్లా కు సీఎం వైఎస్. జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు.

తొలి నుంచి గుంటూరు జిల్లాకు రాజకీయంగా ఓ ప్రాధాన్యత ఉందన్నారు. జిల్లా అభివృద్ధి కి తన శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ,  కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తాను. ఏ ప్రభుత్వం అధికారం లోకి రావాలన్న కార్యకర్తల కష్టమే ముఖ్యం. కార్యకర్తల కష్టాన్ని అమ్ముకున్న ఏ పార్టీ మనుగడ సాధించదన్నారు.

జాతీయ స్దాయిలో ఏ పార్టీ లోను పార్టీ కోసం పని చేస్తున్న వారికి సరైన ప్రాధాన్యం లభించడం లేదు. కులాన్ని తెరపైకి వచ్చి తమ అవసరాలకు వాడుకోవడం చంద్రబాబు కు అలవాటు. టీడీపీ బీసీలను ఓటు బ్యాంక్ గానే వాడుకున్నారు. కేవలం జగన్ మాత్రమే ఇద్దరు బీసీలకు రాజ్యసభ కేటాయించారు. అన్ని నామినేటెడ్ పోస్టులలో రిజర్వేషన్ కులాలకు 50 శాతం కేటాయించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని వెంకటరమణ అన్నారు.

భారత దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు వైకాపా ఆదర్శంగా నిలుస్తుంది. ఎంపీ రఘురామకృష్ణమ రాజు వ్యవహారం ఆయన వక్తిగతం. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారి పైనైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక హోదా ఒక్కటే కాదు కేంద్రం నుంచి రావాల్సిన అన్ని ప్రాజెక్టులు పై పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.

You might also like