FbTelugu

జగన్ పై ఆరోపణలు సరికాదు: మోపిదేవి

విశాఖపట్నం: పార్టీ లో కార్యకర్త అయినా ఎంపీ అయినా క్రమశిక్షణ తప్పితే వారిపై చర్యలు తప్పకుండా ఉంటాయని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు.
ఇవాళ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి మోపిదేవి వెంకటరమణ దంపతులు దర్శనం చేసుకున్నారు.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వివాదంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రులకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదనేది సరికాదన్నారు. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన దగ్గర్నుండి మొదటి సంవత్సరం పరిపాలన గాడిలో పెట్టే క్రమంలో ఎమ్మెల్యేలతో మాట్లాడడం కష్టం అయిందన్నారు. ఇప్పుడు ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటలకు మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశాలు జరుగుతున్నాయని మోపిదేవి అన్నారు.
కరోనా కట్టడి చేయడంలో దేశంలోనే ప్రథమ స్థానం ఆంధ్రప్రదేశ్ నిలబడిందని అన్నారు. గ్రామ వాలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థ దేశంలోనే కాదు ప్రపంచానికి దేశాల్లో ఆదర్శంగా నిలిచిందని అన్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సచివాలయం వ్యవస్థను రానున్న రోజుల్లో అమలు చేస్తుందని మంత్రి మోపిదేవి అన్నారు.

You might also like