FbTelugu

గుండె ను తీసి వండిన రాక్షసుడు

వాషింగ్టన్: నేరగాళ్లు, దోపిడి దొంగలు చెప్పే విషయాలు పోలీసులకు సాధారణమే కాని కొన్ని నేరాలు వారికి నిద్రలేకుండా చేస్తాయి. వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అలాంటి ఘటనే ఒక్లహోమా నగరంలో చోటు చేసుకున్నది. ఒళ్లు గగుర్పాటు పొడిచే ఈ ఘటన వింటే ఎవరైనా నిర్ఘాంతపోతారు.

డ్రగ్స్ కేసులో నిందితుడు అయిన లారెన్స్ పౌల్ అండర్సన్ అనే వ్యక్తి రెండు దశాబ్ధాల పాటు జైలు జీవితం గడిపాడు. శిక్షా కాలం పూర్తి కావడంతో ఇటీవలే విడుద అయి ఇంటికి చేరుకున్నాడు. జైలు నుంచి వచ్చిన రెండు వారాలకే తన క్రిమినల్ మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నాడు. తన ఇంటి పక్కనే ఉన్న వ్యక్తిని కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. అతని శరీరం నుంచి గుండెను బయటకు తీసి, దాన్ని తన అంకుల్ ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడే దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, ఆలుగడ్డలతో కలిపి కూర చేశాడు. ఆ కూరను వారికి తినిపించే ప్రయత్నం చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న అంకుల్ కుటుంబ సభ్యులు ఆ కూరను తినేందుకు నిరాకరించారు. అతని నుంచి దూరంగా ఉండేందుకు ఇంటి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. నేను వండిన కూర తినరా అంటూ అంకుల్ పౌల్ ను, ఆయన నాలుగేళ్ల కుమార్తెను చంపేశాడు. ఈ లోపు పౌల్ భార్య అతని బారి నుంచి తప్పించుకుని బయటపడింది. స్థానికులు ఆమెను రక్షించి వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. బాధితురాలు లారెన్స్ పౌల్ అండర్సన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎందుకు చంపేశావని అడగ్గా, అంకుల్ పౌల్ ఇంట్లో రాక్షసులు ఉన్నారని, వారిని తరమడం కోసం గుండెకాయ ను వండి వారితో తినిపించాలని అనుకున్నానని చెప్పాడు. అలా తింటే రాక్షసులు పారిపోతారన్నారు. వారు అంగీకరించకపోవడంతో కొట్టి చంపేశానని, లేదంటే రాక్షసులు వారి కుటుంబాన్ని పీడించేవారన్నాడు. ఆ పై జనాలను కూడా చంపేసేవాళ్లని లారెన్స్ చెప్పడం చూసి పోలీసులు కూడా వణికిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.