FbTelugu

జూన్ 1న కేరళకు రుతుపవనాలు

న్యూఢిల్లీ: కేరళను జూన్ 1న రుతుపవనాలు తాకనున్నట్లు వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇది ముందస్తు అంచనా మాత్రమేనని, ఈ నెల 15వ తేదీన రుతుపవానాల రాక, నెలాఖరున వర్షపాతంపై అధికారిక ప్రకటన చేయనున్నారు.

దేశంలో ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఫలితంగా రైతులకు మేలు జరుగుతుందని వాతావరణ విభాగం చెబుతోంది. దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ)లో ఈ ఏడాది 98 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఏప్రిల్ 16న భారత వాతావరణశాఖ తన ముందస్తు సూచనలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ అంచనాల్లో 5 శాతం అటూఇటుగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. భారత్‌లో వరుసగా రెండేళ్లు సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు కురిశాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.