FbTelugu

అప్పుడే పలకరించిన తొలకరి

హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో వర్షాలు

హైదరాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచనలు వాతావరణ కేంద్రం ప్రకటించింది.

రాగల 24 గంటలలో తూర్పు మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ 3 వ తేదీకల్లా ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.

రాగల 24 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. జూన్ 1 వ తేదీన కేరళ రాష్ట్రంలోనికి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.

చత్తీస్ గఢ్ నుండి లక్షదీవులు వరకు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈరోజు, ఎల్లుండి కొన్నిచోట్ల, రేపు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియచేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.