FbTelugu

కొల్లు’ ఇంతకి తెగిస్తాడని అనుకోలేదు: వెంకటేశ్వరమ్మ

అమరావతి: కొల్లు రవి ఇంతకి తెగిస్తాడని అనుకోలేదంటూ.. మోకా భాస్కరరావు భార్య వెంకటేశ్వరమ్మ వాపోయారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన భర్తది ముమ్మాటికి రాజకీయ హత్యేనని, రాజకీయంగా ఎదగడం ఓర్వలేకనే తన భర్తను హత్యచేశారని వెంకటేశ్వరమ్మ ఆరోపించారు.

తన భర్త కొల్లు రవీంద్ర అక్రమాలను మొదటినుంచి ప్రశ్నించేవారని అన్నారు. గూటాల చెరువు భూముల అమ్మకంపై భాస్కర్ రావు పోరాటం చేశారని అన్నారు. మంచి చేస్తూ ఎదిగిపోతున్నాడని ఓర్వలేకపోతే.. వారూ ఎక్కవ మంచిని చేసి ఎదగాలి గాని ఇలా హత్య చేయడమేంటని ప్రశ్నించారు.

You might also like