FbTelugu

టిక్ టక్ వీడియోతో మోహన్ ఆత్మహత్య

Mohan-commits-suicide-with-TikTok-video

కువైట్: డబ్బులు చెల్లించకుండా పరారీలో ఉన్నాడంటూ వీడియో క్రియేట్ చేసి టిక్ టాక్ లో పెట్టినందుకు మనస్తాపానికి గురైన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజోలు మండలం శివకోటి పోస్టాఫీసు వీధికి చెందిన పి. మోహన్ కుమార్ (30) ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. దినసరి కూలీగా పనిచేస్తూ ప్రతి నెలా కొంత సొమ్మును రాజోలులో ఉన్న అమ్మకు పంపిస్తుండేవాడు. రూ.2వేల దినార్ల చీటి పాడుకుని, కనిపించకుండా పరారీలో ఉన్నాడంటూ స్నేహితుడు వడ్డీ దుర్గరావు వీడియో రూపొందించాడు. ఆ వీడియోలో మోహన్ కుమార్ ఫోటోలు జత చేర్చి టిక్ టాక్ లో పెట్టడంతో మోహన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన పరువు పోయిందంటూ మోహన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కువైట్ పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని ఇండియాకు పంపించారు.

You might also like