FbTelugu

రాజకీయాలకు రజినీ పనికిరాడు: మోహన్ బాబు

రజినీకాంత్ చాలా మంచివాడు, చీమకు కూడా హాని చేయని ఆయన రాజకీయాలకు అసలు పనికిరాడని నటుడు, నిర్మాత మోహన్ బాబు అన్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ఆయనకు రాజకీయాలు కలిసిరావన్నారు.

డబ్బులిచ్చి ఓట్లు, సీట్లు కొనలేమని, ఇక్కడ ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియదని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. రజినీ రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటన వచ్చిన తరువాత మోహన్ బాబు స్పందించారు. రాజకీయాల్లోకి రానంత వరకు మంచోడివి అన్న వారే, రేపు వచ్చాక చెడ్డవాడివి, అవినీతి పరుడవి అంటూ విమర్శిస్తారన్నారు. అదొక రొచ్చు, బురద అని, బురద అంటుకోకుండా ఉండాలంటే రాకపోవడమే మంచిదన్నారు. ఆయన అభిమానులు కూడా అదే లక్షణాలు కలవారని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.