FbTelugu

బుల్‌బుల్‌ తుపానుపై మోదీ సమీక్ష

Modis-review-of-Bulbul-Storm

ఢిల్లీ: పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ముప్పుగా పరిణమించిన బుల్‌బుల్‌ తుపానుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. పరిస్థితి ఎలా ఉందంటూ మోదీ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీతో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తుఫాన్ కారణంగా పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హుగ్లీ, హావ్‌డా, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య ‘బుల్‌బుల్’ తుఫాన్ తీరం దాటింది. పశ్చిమబెంగాల్, ఒడిశా, పారాదీప్, బంగ్లాదేశ్ తీరాల్లో గంటకు 120-140 కిలోమీటర్ల వేగంతో గాలులు బలంగా వీస్తున్నాయి.

You might also like