FbTelugu

కరోనా కట్టడిపై మోదీ కీలక సమావేశం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడిపై దేశ ప్రధాని మోదీ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చ జరపనున్నారు.

ఈ కాన్ఫరెన్సులో దేశంలో కరోనా తాజా పరిస్థితులు, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. తొలుత కోటి మంది హెల్త్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్, ప్రజారోగ్యం కోసం పోరాడిన వారికే తొలి ప్రాధాన్యం అంశాలపై చర్చించనున్నారు. ఇందుకు గానూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వైద్యులు, వైద్య సిబ్బంది డేటా సేకరణపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.