FbTelugu

సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించిన మోదీ

Modi-welcomes-Supreme-Court-verdict

ఢిల్లీ: చట్టానికి లోబడి ఎలాంటి వివాదాన్నైనా పరిష్కరించుకోవచ్చు అని, అందుకు ఉదాహరణ అయోధ్య భూవివాద పరిష్కారమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి సామరస్య ముగింపు ఇచ్చారు. ప్రతిఒక్కరూ వారి అభిప్రాయాలు వెలిబుచ్చేందుకు సరిపడా సమయమిచ్చారు. ఈ తీర్పు భారతీయ న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచుతుందన్నారు. భారత న్యాయవ్యవస్థ స్వతంత్రత, పారదర్శకత, దూరదృష్టిని తీర్పు చాటిచెబుతుందన్నారు. చట్టంముందు అందరూ సమానమని చెప్పడానికి ఈ తీర్పు నిదర్శనమన్నారు.

130 కోట్ల మంది పాటిస్తున్న శాంతి, సంయమనం ఇన్నేళ్లుగా పాటిస్తున్న విలువలకు నిదర్శనమే ఈ తీర్పు అన్నారు. ఈ ఐక్యత భావం దేశ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తుంది. కోర్టు తీర్పు ఒకరి గెలుపు, మరొకరి ఓటమిగా చూడకూడదని ప్రధాని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఒకరి గెలుపు, మరొకరి ఓటమిగా చూడకూడదన్నారు. రామభక్తి, రహీం భక్తికాదు… భారత భక్తి భావాన్ని బలోపేతం చేయాల్సిన సమయమిదని సూచించారు. దేశ ప్రజలందరూ శాంతి, సద్భావన, ఐకమత్యంతో నిలవాలని విజ్ఞప్తి చేశారు.

You might also like