FbTelugu

నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం తప్పదు: మోదీ హెచ్చరిక

ఢిల్లీ: కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న సమయంలో నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించక తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.
ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. వర్షాకాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇతర దేశాలతో పోల్చితే కరోనాపై పోరాటంలో ముందున్నాన్నారు. కంటైన్మెంట్ జోన్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక దృష్టిపెట్టాలన్నారు. సర్పంచి నుంచి ప్రధాని వరకు అందరూ నియమాలు పాటించాలి అని అన్నారు.
ఈ కష్టకాలంలో పేదలకు ఆకలి కోసం వేదన అనుభవించకుండా చూశామని మోదీ అన్నారు. కరోనా దృష్ట్యా పేదలకు రూ.1.75 లక్షల కోట్లు కేటాయించామన్నారు. సరైన సమయంలో లాక్ డౌన్ విధించడం వల్ల ప్రాణ నష్టం తగ్గించామన్నారు. ఫేస్ మాస్క్ పెట్టుకోలేదని ఒక దేశంలో ప్రధానికే ఫైన్ వేశారని మోదీ గుర్తు చేశారు.

నవంబర్ వరకు పేదలకు ఉచిత రేషన్ ఇస్తామన్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం లేదా గోదుమలు ఇస్తామన్నారు. వన్ నేషన్ వన్ రేషన్ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ పథకం వల్ల వలస కూలీలకు లబ్ధి జరుగుతుందన్నారు. దీపావళి వరకు గరీబ్ కల్యాన్ అన్న యోజన పొడిగించామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.