FbTelugu

రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం: మోదీ

న్యూఢిల్లీ: చైనా హద్దు మీరి రెచ్చగొడితే చూస్తూ ఊరుకోమని భారత ప్రధాని మోదీ అన్నారు. భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ కుమార్ మృతిపై ఆయన స్పందించారు.

చైనాకు బదులిచ్చే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. భారత్ ఎలాంటి వివాదాలనూ కోరుకోదని అలాఅని భారత సార్వభౌమాధికారంపై ఏమాత్రం రాజీపడేది లేదని అన్నారు. సైనికుల త్యాగాలు వృథాకావని అన్నారు.

You might also like