FbTelugu

మోదీ థాయ్ లాండ్ పర్యటన

Modi-visits-Thailand

దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం థాయ్‌లాండ్‌ పర్యటనకు బయల్దేరారు. ఆయన మూడురోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. 14వ తూర్పు ఆసియా సదస్సులో ప్రధానమంత్రి పాల్గొననున్నారు. దీంతోపాటు ఆసియన్‌ ఇండియా సదస్సులోనూ ఆయన పాల్గొంటారు. గురునానక్‌ 550వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసే కార్యక్రమానికి హాజరవుతారు. థాయ్‌లాండ్‌లో స్థిరపడిన భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. థాయ్‌లాండ్‌ ప్రధాని ప్రయుత్‌ ఛాన్‌ ఓ ఛా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్యాంకాక్‌లో పర్యటిస్తారు. ఆదివారం మోదీ-ప్రయుత్‌ల సమావేశం జరగనుంది. వాణిజ్యం, తీర ప్రాంతాల భద్రత, అనుసంధానం వంటి అంశాల్లో సహకారం పెంపు వంటి అంశాలపై చర్చకు రానున్నాయి. దీంతో పాటు ఆసియా దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించే లక్ష్యంతో మోదీ పర్యటన సాగనుంది.

You might also like