FbTelugu

వలస కార్మికులను మోదీ ఆదుకోవాలి: రాహుల్

అమరావతి: కరోనా ఆంక్షలతో ఉపాధి లేక పట్టణాల నుంచి స్వగ్రామాలకు తరలి వెళ్తున్న వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

దేశంలోని వలస కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన కోరారు. గతేడాది మాదిరి కాకుండా కనీసం ఈ ఏడాది అయినా వలస కార్మికులన కష్టాలను కేంద్రం గుర్తించాలన్నారు. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, ఇప్పుడు కూడా కూలీలను ఆదుకోకపోతే ఎలా అన్నారు. కేంద్రం బాధ్యతతో వ్యవహరించి, వారి ఖాతాల్లో నగదు నేరుగా జమ చేయాలని రాహుల్ కోరారు. పట్టణాల్లో ఉపాధి లేక వలస కార్మికులు తిరుగుముఖం పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో వారికి డబ్బులు చెల్లించాలని రాహుల్ ట్వీట్ చేశారు. ప్రజా సంక్షేమ చర్యలకు బదులు కరోనా వ్యాప్తి జరుగుతోందంటూ ప్రజలపైనే నిందలు వేయాలని అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు.

నైట్ కర్ఫ్యూ, కరోనా ఆంక్షల కారణంగా కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, యుపి నుంచి పెద్ద ఎత్తున వలస కార్మికులు సోంతూళ్ల బాట పట్టారు. మున్ముందు మరికొన్ని రాష్ట్రాల నుంచి కూలీలు స్వగ్రామాలకు తరలివెళ్లనున్నారు. గతేడాది అనుభంతో ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు.

You might also like

Leave A Reply

Your email address will not be published.