FbTelugu

అన్నదాతకు అండగా మోదీ సర్కార్ వరాలు

హైదరాబాద్: స్వావలంబన సాకారం దిశగా మోదీ సర్కార్ అన్నదాతలకు అండగా అద్భుతమైన ఆసరా ఇచ్చిందని నేషనల్ హార్టి కల్చర్ బోర్డు డైరెక్టర్ సత్యం కృష్ణం రాజు తెలిపారు.

ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన మూడో ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. రైతుల కోసం ప్రకటించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 

🔸 13వ తేదీన ఎంఎస్ఎంఈ (MSME) రంగం కోసం సుమారు రూ.6లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించారు.

🔸14వ తేదీన సుమారు రూ.3.4 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని వివిధ రంగాల కోసం ప్రకటించారు.

🔸 15వ తేదీ మూడో ప్యాకేజీని వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాలపై ప్రకటించారు.

🔸నేడు 11 ముఖ్యమైన చర్యలనుఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు, అందులో 8 అంశాలు ప్రభుత్వం జరిపే ఆర్థిక కేటాయింపులు ఉంటాయి. మిగతా 3 పాలనకు సంబంధించిన అంశాలు ఉన్నాయి.

 

🔸దేశంలో 85 శాతం వ్యవసాయ కమతాలు చిన్న, సన్నకారు రైతులవేనన్నారు. వర్షాభావం, వాతావరణ సమస్యలు అధిగమించి రైతులు శ్రమిస్తున్నారన్నారు. ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినట్లు తెలిపారు.జూట్‌ ఉత్పత్తిలో భారత్‌ అగ్రగామిగా ఉందన్నారు. చెరుకు, పత్తి, వేరుశెనగ, పప్పుధాన్యాల ఉత్పత్తిలో మనం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నామన్నారు.

🔸వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, మత్స్య, డెయిరీ, పప్పుధాన్యాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తులకు ప్యాకేజీని ప్రకటించారు.

 

11 ముఖ్యమైన అంశాలు…

🔸దేశంలోనే రైతులను ఆదుకోవడానికి ఈ 11 పాయింట్ ఫార్ములా.

🔸🔸 లాక్ డౌన్ సమయంలో రైతుల నుంచి రూ.74300 కోట్ల ధాన్యం కొనుగోలు చేశాం. పీఎం కిసాన్ ఫండ్ ట్రాన్స్ఫర్ కింద రైతుల ఖాతాల్లోకి రూ.18700 కోట్లు బదిలీ చేశాం. ఫసల్ బీమా యోజన కింద నష్టపోయిన రైతులకు రూ.6400 కోట్లు క్లెయిమ్ లను క్లియర్ చేయడం జరిగింది.

 

🔸🔸రూ.5వేల కోట్లతో పాల ఉత్పత్తిదారుల ప్రత్యేక పథకం

🔸లాక్ డౌన్ సమయంలో పాల డిమాండ్ 20 -25 శాతం తగ్గింది. సహకార సంఘాలు 560 లక్షల లీటర్ల స్థానంలో 360 లక్షల లీటర్లు మాత్రమే కొనుగోలు చేసారు. డెయిరీ కోఆపరేటివ్స్కు 2020-21కి గాను 2శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు. 2 కోట్ల మంది పాడిరైతులకు రూ.5వేల కోట్లు ప్రోత్సాహకం. పాల సేకరణ ద్వారా పాడి రైతులకు రూ.4100 కోట్లు మేలు చేకూర్చాం.

🔸🔸అలాగే రైతుల దగ్గర నుంచి పంటలు కొనుగోలు చేసి వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు ముందుకొచ్చే స్టార్టప్ లకు ఇతర సంస్థలకు రూ.1 లక్ష కోట్లు ఇస్తున్నాం.

 

🔸🔸స్థానిక పంటల రైతులకు భరోసా

🔸రైతుల కోసం ఒక లక్ష కోట్లతో మౌలిక వసతుల కల్పన. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు స్వల్పకాలిక రుణాలు. అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కోసం క్లస్టర్ లు తీసుకొస్తాం. వ్యవసాయానికి కేటాయించిన నిధుల నుంచి గోదాములు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం. గ్రామీణ ఆహారోత్పత్తుల బ్రాండింగ్ కోసం ప్రత్యేక నిధి.

దేశంలో ఆయా ప్రాంతాల్లో లభించే స్థానిక, ఆర్గానిక్ పదార్థాలను ప్రోత్సహించేందుకు, వాటికి ప్రాచుర్యం కల్పించేందుకు రూ.10 వేల కోట్లను కేటాయిస్తున్నామని, వీటి ద్వారా మైక్రో ఫుడ్ ఎంటర్‌ప్రైజెస్ ఫార్మలైజేషన్ (ఎంఎఫ్ఈ) స్కీమ్ అమలు చేస్తామన్నారు.

🔸ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లుగా ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదంతో ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు.

🔸కర్ణాటకలో రాగి, కశ్మీరులో కుంకుమపువ్వు, తెలంగాణలో పసుపు, ఆంధ్రాలో మిర్చి క్లస్టర్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పారు.ఇలా ప్రతి రాష్ట్రంలోనూ ఆయా ప్రాంతాల్లో లభించే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ప్రాసెస్ చేసి, మార్కెట్ చేసేలా అత్యుత్తమ ప్రమాణాలతో సాంకేతిక సహాయాన్ని అందిస్తామన్నారు.

🔸దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల ఎంఎఫ్ఈలకు దీనివల్ల లబ్ధి చేకూరుతుందని తెలిపారు

 

🔸🔸మత్స్యకారుల కోసం రూ.20వేల కోట్లు కేటాయింపు

మత్స్యకారులను ప్రోత్సహించేందుకు రూ.20వేల కోట్లు ఏర్పాటు చేస్తున్నాం. మత్సకార రంగంను ప్రోత్సహించేందుకు రూ.11వేల కోట్లు కేటాయిస్తున్నాం..మరో రూ.9వేల కోట్లు హార్బర్ల అభివృద్ధి కోసం మండీల కోసం వినియోగిస్తాం.

ఫిషరీస్ రంగంలో 55లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

 

🔸🔸జంతు సంరక్షణ కోసం రూ. 1333 కోట్లు

🔸పశువులు రోగాల బారిన పడకుండా నియంత్రించేందుకు లేదా రోగ నివారణకు 100శాతం వ్యాక్సినేషన్ తీసుకొస్తాం. 53 కోట్లు మేర జంతువులకు వ్యాక్సినేషన్ చేయిస్తాం.

🔸జంతు సంరక్షణ కోసం రూ. 1333 కోట్లను కేటాయిస్తున్నాం. యానిమల్ హస్బెండరీ కార్యక్రమంలో భాగంగా డెయిరీ ఇండస్ట్రీలో ఎగుమతులు బాగున్నాయి కాబట్టి విదేశీ పెట్టుబడులు కూడా వస్తాయని ఆశిస్తున్నాం.

🔸ప్రస్తుతం పాల ఉత్పత్తి రంగం మన దేశంలో సంక్షోభంలో ఉంది. డెయిరీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.15వేల కోట్లను కేటాయిస్తున్నాం.

 

🔸🔸హెర్బల్ వ్యవసాయం కోసం రూ.4వేల కోట్లు

🔸హెర్బల్ వ్యవసాయంను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ముందుకొస్తోంది. ఇందుకోసం రూ.4వేల కోట్లు కేటాయిస్తున్నాం. 10 లక్షల హెక్టార్లలో హెర్బల్ ఔషధాలు పెంచేందుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది.

🔸 తేనె పట్టు పరిశ్రమల కోసం రూ. 500 కోట్లు కేటాయింపు.

🔸వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నాం.

🔸కూరగాయలు, ఉల్లిపాయలు, పండ్ల సరఫరాకు ఆపరేషన్‌ గ్రీన్‌ పథకం తీసుకొస్తున్నాం. దీని కింద ఆరు నెలల పాటు రవాణాలో 50 శాతం రాయితీ అందిస్తాం.

🔸రైతులు ఎక్కడైనా పంట అమ్ముకోవచ్చు. కేంద్రం రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతుంది. అమ్మకాలపై పరిమితులను తొలగిస్తారు.దీని కోసం కొత్త చట్టం తెచ్చి , వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించి లైసెన్లను రద్దు చేస్తారు .

🔸 దీని ద్వారా దేశంలో ఎక్కడ మంచి ధర వస్తే రైతులు అక్కడ పంటలు అమ్ముకోవచ్చు.ఇందుకోసం ఈ – ట్రేడ్ విధానం మరింత బలోపేతం చేస్తారు. ఏ పంట ఎంతకు కొంటారో చెప్పేలా చట్టంలో మార్పులు చేస్తారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.