FbTelugu

భారత్ లో కరోనా మరణాలు తక్కువే: మోదీ

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని, అయితే ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా మరణాలు చాలా తక్కువ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ఇవాళ ఆయన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైరస్‌పై పోరాటానికి మరింత సమర్థత అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయంతో కరోనాను తరిమికొడదామని పిలుపునిచ్చారు.
సరిహద్దు సమస్యను ప్రస్తావిస్తూ.. భారత్‌ ఎప్పుడూ స్నేహపూర్వక సంబంధాల కోసమే ప్రయత్నిస్తుందని అన్నారు. భారత జవాన్ల ధైర్యసాహసాలకు దేశం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. పాకిస్థాన్ ఆనాడు అంతర్గత సంఘర్షణల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు భారత్‌ భూములను స్వాధీనం చేసుకునేందుకు దురాలోచన చేసిందన్నారు.

You might also like