FbTelugu

మోదీ రోజ్ గార్ దో.. నెటిజన్ల ఫైర్

న్యూఢిల్లీ: అచ్చే దిన్ తీసుకువస్తామంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీపై నిరుద్యోగులు భగ్గుముంటున్నారు.
దేశంలో పెరిగిన నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు మృగ్యమవడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇక ట్విటర్లో అయితే నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూ కసి తీర్చుకుంటున్నారు. మోదీ ఉద్యోగాలు ఇవ్వండి (మోదీ రోజ్ గార్ దో) అనే హ్యాష్ ట్యాగ్ పై ఇప్పటికే పది లక్షల మంది స్పందించారంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ప్రజల మనస్సుల్లో మాట (సునో జన్ కే మన్ కీ బాత్) వినంటి అని రీ ట్వీట్ చేశాడు. దానికి మోదీ ఉద్యోగాలు ఇవ్వండి అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు. ఈ మధ్యకాలంలో నెటిజన్లు మోదీ కి వ్యతిరేకంగ గళమెత్తుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.