FbTelugu

మోదీ దిగిపో… మోతెక్కిపోతున్న ట్విటర్

ప్రధానికి ఎన్నికల ప్రచారంపై నెటిజన్ల మండిపాటు

రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్న

ఒక్క వారంలోనే 50 లక్షల ట్వీట్లు

న్యూఢిల్లీ: దేశంలో ఇంతటి విలయానికి కారకుడైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెంటనే పదవి నుంచి దిగిపోవాలంటూ సోషల్ మీడియాలో హోరెత్తుతున్నది. మోదీకి ఎన్నికలు, అధికారంపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదంటూ తూర్పారబడుతున్నారు.

సోషల్ మీడియాలో విపరీతమైన జనాదరణ ఉన్న మోదీకి ట్విటర్ లో ఈ స్థాయిలో నిరసన సెగ తగలడం ఇది రెండోసారి. గతేడాది ఆగస్టులో కూడా ఒకసారి ఇలాగే నిరసన సెగ తగలడంతో బిజెపి నాయకులు సైతం ఆందోళనకు గురయ్యారు.

ఆయన ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో జేఈఈ, నీట్ గురించి మాట్లాకపోవడంపై సోషల్ మీడియా లో నెటిజన్లు విరుచుకుపడింది. ఆయన ప్రసంగ వీడియోకు డిస్‌లైక్‌లతో తమ నిరసన తెలిపి చెమటు పట్టించారు. ఆ వీడియోకు 74వేల లైక్‌లు వస్తే ఏకంగా 5 లక్షల మంది డిస్‌లైక్ చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా #ResignModi ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఉద్యోగాలు కావాలంటూ నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. మోదీ రోజ్‌గార్ దో… మోదీ ఉద్యోగమివ్వు… వంటి ట్వీట్లు బిజెపి ని నిద్రపట్టనివ్వడం లేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటూ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో కరోనా మృతదేహాలను రహస్యంగా కాల్చివేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ దాదాపు మూడు లక్షల ట్వీట్లు రావడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. దేశంలో కరోనా వైరస్ విజృంభణకు మోదీనే కారణమని, ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్ యాదవ్ లు ఆరోపించారు. వీరిద్దరి తో పాటు నెటిజన్లు మోదీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.