FbTelugu

గురుద్వారాలో మోదీ ప్రార్థనలు

Modi-prayers-in-Gurdwara

చండీగఢ్‌: ఒకవైపు అయోధ్య తీర్పు కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తుండగా మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ సుల్తాన్ పూర్ లోని లోధిలో బెర్ సాహిబ్ గురుద్వారా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం సందర్భంగా ప్రధాని గురుద్వారను సందర్శించారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని కి పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ స్వాగతం పలికారు. పాకిస్తాన్‌లోని నరోవల్‌ జిల్లా కర్తార్‌పూర్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను భారత్‌లోని డేరాబాబా నానక్‌ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టును ప్రధాని మోదీ ప్రారంభించారు. తరువాత 500 మందితో కూడిన మొదటి యాత్రికుల బృందం జాతా కు జెండా ఊపారు.

You might also like