FbTelugu

జర్మనీ ఛాన్సలర్ తో మోదీ భేటీ

Modi-meets-with-German-Chancellor-today

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ ఛాన్సలర్​ఏంజెలా మెర్కెల్​తో నేడు భేటీ కానున్నారు. భారత్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా మెర్కెల్​నిన్న దిల్లీ చేరుకున్నారు. ఇరువురు అగ్రనేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. దాదాపు 20 ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది.

థాయ్‌లాండ్‌లో మోదీ మూడు రోజుల పర్యటన:

మోదీ నవంబర్‌ 2 నుంచి 4 వరకు థాయ్‌లాండ్‌లో జరిగే పలు సదస్సుల్లో పాల్గొంటారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్‌ ఛాన్‌-ఒ-ఛా ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ బ్యాంకాక్‌ సందర్శించనున్నట్లు విదేశాంగ కార్యదర్శి విజయ్ ఠాకూర్​సింగ్​తెలిపారు.

You might also like