FbTelugu

కట్టుకున్న భార్యనే మోదీ వదిలేశాడు… మీరో లెక్కా?: నారాయణ

విశాఖపట్నం: కట్టుకున్న భార్యను విడిచిపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ స్టీలు ప్లాంట్ పై మీరు రాసే ప్రేమ లేఖలకు ఎలా స్పందిస్తాడని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హాట్ కామెంట్స్ చేశారు.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యక్ష పోరాటం చేయ్యాలని, సిఎం జగన్ నేరుగా ఉద్యమంలో పాల్గొనాలని, లేఖలు రాసినంతా మాత్రనా ప్రధాని స్పందించడన్నారు. మోదీ ప్రభుత్వం దేశాన్నే అమ్మేస్తుందని, అయినా రాష్ట్ర నేతలు లోపాయకారిగా మద్దతు పలుకుతున్నారని నారాయణ అన్నారు. జగన్ విశాఖ రాజధాని అంటున్నాడు, స్టీల్ ప్లాంట్ లేకపోతే ఇంకా రాజధానికి ఏం అందం ఉంటుందన్నారు. బోడి గుండుకు మల్లే పూలు ఎందుకు, జడకు మల్లేపూలు పెట్టుకోవాల్సి ఉంటుందని జోస్యం చెప్పారు. విజయసాయి రెడ్డి కి ప్రధాని వద్ద మంచి పలుకుబడి ఉంది. ఆయన తలచుకుంటే ఈ సమస్య పరిష్కారించగలడన్నారు. అధికార వైసిపి కి స్టీల్ ప్లాంట్ పై చిత్తశుద్ది లేదన్నారు. అతి చిన్న రాష్ట్రం మిజోరం గవర్నర్ గా కంభంపాటి హరిబాబు నియామకం అయితే సంబురాలు చేస్తున్నారు, ఇక్కడ హరిబాబు పాపం చేస్తే మిజోరం లో పుణ్యం వస్తుందా అని విమర్శించారు. విశాఖ లో పుట్టి విశాఖ లో ఎదిగి ఉన్నతంగా నిలబెట్టిన నగరంలో స్టీల్ ప్లాంట్ కి అన్యాయం జరుగుతుంటే హరిబాబు ఎందుకు స్పందించడలేదని ప్రశ్నించారు. నిజంగా విశాఖ మీద ప్రేమ ఉంటే మిజోరం గవర్నర్ పదవి తిరస్కరించాలన్నారు. ఆయన కూడా స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయ్యాలని సూచించారు. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఇప్పటికైన నోరు తెరవండి, గతంలో స్టీల్ ప్లాంట్ కోసం మీరు పోరాటం చేశారు అది గుర్తుకు రావడం లేదా అని నారాయణ అన్నారు.

తమిళనాడు లో కేంద్రం నిర్ణయాలు విరుద్దంగా ఉంటే ప్రభుత్వమే సంపూర్ణ బంద్ చేస్తుందని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఎన్.చంద్రబాబు, సిఎం జగన్ ఇద్దరు ప్రత్యక్ష పోరాటంలోకి రావాలని ముందే చెప్పానన్నారు. ఈ నెల 12న విజయవాడలో విశాఖ స్టీలు ప్లాంట్ కాపాడుకునేందుకు అఖిల పక్షాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు నారాయణ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.