FbTelugu

బాలు ఆరోగ్యంపై మోదీ వాకబు

చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యాలయం ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై వాకబు చేసింది. ఎంజీఎం హెల్త్ కేర్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు.

బాలు చికిత్సకు అయ్యే ఖర్చులను తామే భరిస్తామని తమిళనాడు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. తమిళనాడు సీఎం పళనీ స్వామి, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. తన తండ్రి ఆరోగ్యం మెరుగుపడిందని, శ్వాస బాగానే తీసుకుంటున్నారని ఆయన కుమారుడు చరణ్ తెలిపారు.

You might also like