FbTelugu

మోదీ జీ మీరే జోక్యం చేసుకోవాలి: షోయబ్ అక్తర్

ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటన అభిమానులకే సహచర ఆటగాళ్లను కూడా నిద్రపట్టనివ్వడం లేదు. అతడు జట్టుకు చేసిన సేవలను అన్ని వర్గాల వారు కొనియాడుతున్నా… పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించడం ఆసక్తిగా మారింది.

వచ్చే ఏడాది ఇండియాలో నిర్వహించే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ఆడిన తరువాతే క్రికెట్ కు వీడ్కోలు పలికేలా చూడానలి అక్తర్ కోరుతున్నాడు. ధోనీకి ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వచ్చే ఏడాది ప్రపంచ కప్ గెలిచాకే వీడ్కోలు పలకాల్సింది. ఆయన సాధించలేనిది ఏమీ లేదని, రాంచి లాంటి చిన్న పట్టణం నుంచి వచ్చి క్రికెట్ శిఖరంగా ఎదిగాడన్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని ధోని కి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అని అక్తర్ కోరాడు.

You might also like