FbTelugu

ఏంజెలా మెర్కెల్ కు మోదీ అరుదైన గిఫ్ట్

Modi-is-a-rare-gift-to-Angela-Merkel

ఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఏంజెలా మెర్క‌ల్ కు భార‌త ప్రధాని మోదీ అరుదైన బహుమతులను అందించారు. ల‌డ‌ఖ్ మ‌హిళ‌లు స్థానిక ఉన్నీతో త‌యారు చేసే వ‌స్త్రం ఇచ్చారు. శీత‌కాలంలో ల‌డాఖీ మ‌హిళ‌లు చ‌ర‌క‌పై ఉన్నీతో ఆ వ‌స్త్రాన్ని త‌యారు చేస్తారు. దీన్నే కాల్ ఆఫ్ ల‌డాఖ్‌గా కూడా పిలుస్తారు. చున్నీ లేదా స్కార్ఫ్ త‌ర‌హాలో మ‌హిళ‌లు ఈ వ‌స్త్రాన్ని వాడుతారు. ఇక స్వాతంత్రోద్య‌మ స‌మ‌యంలో మ‌హాత్మాగాంధీ వాడిన కేవీ ర‌త్నం పెన్నును కూడా మెర్క‌ల్‌కు బ‌హూక‌రించారు. రాజ‌మండ్రికి చెందిన కేవి ర‌త్నం ఇంక్ పెన్నును త‌యారు చేసి.. అప్ప‌ట్లో గాంధీకి ఇచ్చినట్టు సమాచారం.

You might also like